
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత 'నీరజ్ చోప్రా'.. జర్మన్ ఆటోమోటివ్ దిగ్గజం 'ఆడి ఇండియా'తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యు స్పోర్ట్స్ కూడా ధ్రువీకరించింది.
"నీరజ్ చోప్రా శ్రేష్ఠతకు మాత్రమే కాదు, దృఢ సంకల్పం, ముందుకు సాగడానికి చిహ్నం. చోప్రా దృష్టి, వేగం, అసమానమైన పనితీరు తమ బ్రాండ్‌తో సంపూర్ణంగా సరిపోతాయి'' అని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు.
ఇదీ చదవండి: ధర ఎక్కువైనా.. మూడు లక్షల మంది కొనేశారు
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఆడి కంపెనీ.. 2025 మొదటి త్రైమాసికంలో అమ్మకాల్లో 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024లో కంపెనీ భారతీయ విఫణిలో లక్ష కార్లను విక్రయించింది. ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ లాంచ్ చేస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న కంపెనీ ఇటీవల.. ఆర్ఎస్ క్యూ8 పర్ఫామెన్స్ కారును రూ. 2.49 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్ చేసింది.
A partnership defined by grit, passion, and performance.
We’re super excited to have Neeraj Chopra, our Olympic champion, associated with the Audi India family. Can’t wait for the ride ahead! #AudiIndia #NeerajChopra pic.twitter.com/Oi8aIDczMR— Audi India (@AudiIN) May 26, 2025