ఈ-ట్రక్కు కొంటే రూ.9.6 లక్షలు డిస్కౌంట్‌! | Centre Pushes E Truck Adoption with PM E Drive Incentive, Check Out Full Details Inside | Sakshi
Sakshi News home page

ఈ-ట్రక్కు కొంటే రూ.9.6 లక్షలు డిస్కౌంట్‌!

Jul 12 2025 9:44 AM | Updated on Jul 12 2025 11:23 AM

Centre Pushes E Truck Adoption with PM E DRIVE Incentive

గ్రీన్ మొబిలిటీ, సుస్థిర రవాణా దిశగా భారత్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారత ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ (ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్‌) పథకం కింద మార్గదర్శకాలను విడుదల చేసింది. కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాలతో నడుస్తున్న వాహనాల స్థానే స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. భారీ వాహనదారులు ఎలక్ట్రిక్ ట్రక్కు (ఈ-ట్రక్)ను కొనుగోలు చేస్తే రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించబోతున్నట్లు ఈ మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది.

పీఎం ఈ-డ్రైవ్ మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలు

  • ఈ-ట్రక్కుపై రూ.9.6 లక్షల వరకు ప్రోత్సాహకాలు.

  • మొత్తం దేశవ్యాప్తంగా 5,600 ఈ-ట్రక్కులకు ఈ స్కీమ్‌ను వర్తింపజేస్తారు.

  • సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ ప్రకారం ఎన్ 2, ఎన్ 3 కేటగిరీ ఈ-ట్రక్కులు 3.5 టన్నుల నుంచి 55 టన్నుల బరువు ఉంటే ఇది వర్తిస్తుంది.

  • ట్రక్కులతోపాటు ఎన్ 3 కేటగిరీలోని పుల్లర్ ట్రాక్టర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తారు.

నిబంధనలివే..

  • పాత ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) ట్రక్కుకు సంబంధించిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)స్క్రాపేజ్ రుజువును ఈ ప్రోత్సాహకాల కోసం సమర్పించాల్సి ఉంటుంది.

  • పాత ఐసీఈ ట్రక్కు బరువు కొత్త ఈ-ట్రక్కు కంటే సమానమైన లేదా ఎక్కువ బరువు ఉండాలి.

  • ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధీకృత రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎస్ఎఫ్) జారీ చేయాలి.

  • సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్(సీడీ) లేని కొనుగోలుదారులు డిజిఈఎల్‌డీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది సీడీలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంది.

  • సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వెరిఫికేషన్ పీఎం ఈ-డ్రైవ్ పోర్టల్, రిజిస్టర్డ్‌ డీలర్ ద్వారా నిర్వహిస్తారు.

  • అన్ని వివరాలు ధ్రువీకరించిన తరువాత డీలర్ కొనుగోలుదారు ఐడీని జనరేట్ చేస్తాడు. ప్రోత్సాహకాన్ని నేరుగా ఈ-ట్రక్ అమ్మకానికి వర్తించేలా ఏర్పాటు చేస్తాడు.

ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్‌ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీ

సుస్థిర రవాణా దిశగా అడుగులు

భారతదేశాన్ని గ్రీన్‌ రవాణా ఎకోసిస్టమ్‌వైపు నడిపించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి నొక్కి చెప్పారు. 2070 నాటికి నికర జీరో ఉద్గారాలను సాధించే భారత్‌ లక్ష్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్ విజన్‌కు ఈ ప్రయత్నం కూడా తోడవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement