వాషింగ్టన్: గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎనిమిది యూరోపియన్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. ఆయా దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఫిబ్రవరి నుంచి 10 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్లు ప్రకటించారు.
డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలు ఈ సుంకానికి లోబడి ఉంటాయని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా 2026 జూన్ 1 నుంచి ఈ దిగుమతి సుంకాన్ని 25 శాతానికి పెంచనున్నట్లు కూడా తెలిపారు. గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా కొనుగోలు ఒప్పందం కుదిరే వరకు ఈ సుంకాలు అమల్లో కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు.


