బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ దాదాపు రూ. 1,50,000 మార్క్ చేరుకోవడానికే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. జనవరి 11వ తేదీ 1,40,460 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు.. నేటికి 1,43,780 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధరల్లో ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,40,460 నుంచి రూ. 1,43,780లకు చేరుకుంది. వారం రోజుల్లో పసిడి ధరలు 3320 రూపాయలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,28,750 రూపాయల నుంచి 1,31,800 రూపాయల వద్దకు చేరింది. అంటే 3050 రూపాయలు పెరిగిందన్నమాట.
చెన్నైలో జనవరి 11న 1,39,650 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 17వ తేదీ నాటికి 1,44,870 రూపాయల (రూ.5220 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 1,29,000 నుంచి రూ. 1,32,800 (రూ. 3800 పెరిగింది) వద్దకు చేరింది.
ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి
ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 1,40,610 రూపాయల నుంచి వారం రోజుల్లో 1,43,930 రూపాయల (రూ. 3320 పెరిగింది) మార్క్ చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,900 వద్ద నుంచి రూ. 1,31,950 వద్దకు (3050 రూపాయలు పెరిగింది) చేరింది.


