మారుతి సుజుకి కంపెనీ.. భారతదేశంలో తయారు చేసిన తన విక్టోరిస్ కారు ఎగుమతులను ప్రారంభించింది. 450 వాహనాల మొదటి బ్యాచ్ ఇటీవల ముంద్రా & పిపావావ్ ఓడరేవుల నుంచి రవాణా తరలించింది. అయితే సంస్థ ఈ కారును 'అక్రాస్' పేరుతో గ్లోబల్ మార్కెట్లో విక్రయించనుంది.
మారుతి సుజుకి విక్టోరిస్ కారును లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా.. కంపెనీ ఎండీ & సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, ''మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్'' అనే దార్శనికత ద్వారా ఎగుమతి చేస్తున్నాము. 2025లో దేశం నుంచి 3.9 లక్షల వాహనాలను ఎగుమతి చేసి.. వరుసగా ఐదవ సంవత్సరం భారతదేశపు నంబర్ వన్ ప్యాసింజర్ వాహన ఎగుమతిదారుగా అవతరించామని అన్నారు. ఈ ఏడాది ఈ-విటారా ద్వారా ఎగుమతులను ప్రారంభించామని పేర్కొన్నారు.
విక్టోరిస్ కారు గురించి
మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.
ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!
మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.


