
టయోటా కంపెనీ భారతదేశంలో ఫార్చ్యూనర్ కార్లను ఏకంగా మూడు లక్షల యూనిట్లను విక్రయించింది. 2009లో ప్రారంభమైన ఈ కారు ఆ తరువాత కాలంలోనే అనేక అప్డేట్స్ పొందుతూ వచ్చింది. ఇందులో భాగంగానే.. 2021లో లెజెండర్ వేరియంట్ విడుదలైంది. అంతకంటే ముందు ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యాయి.
ఫార్చ్యూనర్ ప్రస్తుతం 2.8 లీటర్ డీజిల్, 2.7 లీటర్ పెట్రోల్ అనే రెండు ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. డీజిల్ వేరియంట్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతాయి. పెట్రోల్ వేరియంట్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.
లెదర్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీతో కూడిన 8 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, జేబీఎల్ స్పీకర్లు, డ్రైవింగ్ మోడ్‌లు (ఎకో, నార్మల్, స్పోర్ట్), పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్స్ ఫార్చ్యూనర్ కారులో ఉన్నాయి.
ఇదీ చదవండి: అంబాసిడర్ 2.0: దశాబ్దం తరువాత..
టయోటా ఫార్చ్యూనర్ ధరల విషయానికి వస్తే.. పెట్రోల్ 4x2 AT వేరియంట్ ధర రూ. 35.37 లక్షలు. డీజిల్ వేరియంట్ ధర 4x2 MT ధర రూ. 36.33 లక్షల నుంచి రూ. 51.94 లక్షల (టాప్-స్పెక్ 4x4 AT GR-S వెర్షన్) వరకు ఉంటుంది. అదే సమయంలో.. లెజెండర్ వేరియంట్ ధర రూ. 44.11 లక్షల నుంచి రూ. 48.09 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.