
దశాబ్దం క్రితం ఇండియన్ మార్కెట్లో తిరుగులేని కారుగా ప్రసిద్ధి చెందిన హిందూస్తాన్ అంబాసిడర్.. తరువాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు కూడా అక్కడక్కగా కొన్ని కార్లు కనిపించినప్పటికీ.. కంపెనీ మాత్రమే ఉత్పత్తిని ఆపేసి చాలాకాలం అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ కంపెనీ ఈ కారును దేశీయ విఫణిలో లాంచ్ చేయనున్నట్లు, దీనికి పూర్వ వైభవం తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అంబాసిడర్ 2.0 పేరుతో మళ్ళీ ఆ కారు మార్కెట్లో తిరిగి వస్తుందని సమాచారం. ఇది మొదట్లో ఉన్న కారు కంటే కూడా చాలా అద్భుతంగా.. నేటి కాలానికి తగిన విధంగా ఉండేలా సంస్థ రూపొందించే అవకాశం ఉంది. ఈ కారుకు సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హిందూస్తాన్ అంబాసిడర్ కారు.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బోల్డ్ గ్రిల్ కలిగి వెనుక భాగంలో లేటెస్ట్ స్టైల్ టెయిల్ లైట్స్ పొందుతాయి. ఇది క్లాసీ డిజైన్ కలిగి.. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. కారు లోపల కూడా ప్రీమియం సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ డిస్ప్లే, డిజిటల్ క్లస్టర్ వంటి వాటితో పాటు ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే వంటివి కూడా ఉండనున్నాయి. అయితే డిజైన్, ఫీచర్లకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..
అంబాసిడర్ 2.0 కారు 1.5 లీటర్ లేదా 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రావచ్చు. ఆ తరువాత కాలంలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందే అవకాశం ఉంది. ఏబీఎస్, ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి కూడా ఈ కారులో సేఫ్టీ ఫీచర్లుగా ఉండనున్నట్లు సమాచారం.