
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (SIAM) డేటా ప్రకారం.. 2024-25లో భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 'మహారాష్ట్ర' మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో ముందుంది.
SIAM డేటా ప్రకారం.. 2024-25లో మహారాష్ట్రలో ప్యాసింజర్ వాహనాల (PV) అమ్మకాలు 5,06,254 యూనిట్లు (11.8 శాతం)గా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 4,55,530 యూనిట్లు (10.6 శాతం), గుజరాత్ 3,54,054 యూనిట్లు (8.2 శాతం) అమ్మకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత నాల్గవ స్థానంలో కర్ణాటక 3,09,464 యూనిట్లతో (7.2 శాతం), హర్యానా 2,94,331 యూనిట్లతో (6.8 శాతం) ఐదవ స్థానంలో ఉన్నాయి.
ద్విచక్ర వాహన విభాగంలో.. ఉత్తరప్రదేశ్ 28,43,410 యూనిట్ల అమ్మకాలతో (14.5 శాతం వాటా) అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర 20,91,250 యూనిట్లతో (10.7 శాతం), తమిళనాడు 14,81,511 యూనిట్లతో (7.6 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో కర్ణాటక (12,94,582 యూనిట్ల), గుజరాత్ (12,90,588 యూనిట్లు) ఉన్నాయి.
ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీ
త్రిచక్ర వాహనాల విభాగంలో.. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 93,865 యూనిట్లు (12.7 శాతం) అమ్మకాలు జరపగా, గుజరాత్ 83,947 యూనిట్లు (11.3 శాతం), మహారాష్ట్ర 83,718 యూనిట్లు (11.3 శాతం) అమ్మకాలు జరిపాయని డేటా తెలిపింది. కర్ణాటక 70,417 యూనిట్లతో (9.5 శాతం) నాల్గవ స్థానంలో, బీహార్ 47,786 యూనిట్లతో (6.4 శాతం) ఐదవ స్థానంలో నిలిచాయి.