
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి.. కొత్త టోల్ పాలసీపై కసరత్తు చేస్తోంది. టోల్ ప్లాజా గుండా వెళ్లిన ప్రతిసారీ టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఏడాదికి ఒకేసారి చెల్లించే విధంగా ప్లాన్ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఏడాదికి ఒకేసారి 3000 రూపాయలు టోల్ ఫీజు(యాన్యువల్ ప్యాకేజీ)ను చెల్లించడం ద్వారా.. డ్రైవర్లు/వాహనదారులు ఏడాది పొడవునా అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, స్టేట్ ఎక్స్‌ప్రెస్‌వేలలో అపరిమిత దూరం ప్రయాణించవచ్చు. ప్రతి టోల్ గేటు దగ్గర టోల్ ఫీజును ప్రత్యేకించి చెల్లించాల్సిన అవసరం లేదు.
యాన్యువల్ ప్యాకేజీ కోసం.. వాహనదారులకు లేదా డ్రైవర్లకు అదనపు డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఫాస్ట్‌ట్యాగ్(FASTag)ను రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే జీవితకాల ఫాస్ట్‌ట్యాగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. ఈ విధానం కింద రూ. 30,000 చెల్లిస్తే.. 15 సంవత్సరాలు రోడ్డుపై అపరిమిత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. దీనిని ప్రభుత్వం అమలుచేసే అవకాశం లేదు.
ఇదీ చదవండి: కారు కొనడానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియో
వార్షిక ప్యాకేజ్ మాత్రమే కాకుండా డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ డిస్టెన్స్ బేస్డ్ ప్రైస్ విధానంలో 100 కిలోమీటర్ల దూరానికి రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది.