
ఎంతో పాపులర్ అయిన బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు కానుంది. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల భారత మార్కెట్ కోసం పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ ను అప్ డేట్ చేసింది. అయితే ఈ బ్రాండ్ నిశ్శబ్దంగా పల్సర్ ఎన్ 150 ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. పల్సర్ ఎన్ 160 కింద ఉన్న ఈ బైక్ ను బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించారు. దీన్ని వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారన్నది తెలియరాలేదు.
అత్యంత ఆదరణ ఉన్న పల్సర్ లైనప్‌లో రెండు 150 సీసీ పల్సర్లు ఉండేవి. వీటిలో ఒకటి క్లాసిక్ పల్సర్ 150 కాగా మరొకటి పల్సర్ ఎన్ 150. క్లాసిక్ పల్సర్ 150కు అప్‌డేటెడ్ స్పోర్టీ లుక్‌తో పల్సర్ ఎన్ 150 బైక్‌ను తీసుకొచ్చారు. డిజైన్, లుక్ పల్సర్ ఎన్ 160 మాదిరిగానే ఉన్న ఈ బైక్ కొనుగోలుదారులలో ఆదరణ పొందిన ఎంపికగా కొనసాగుతోంది.
పల్సర్ ఎన్ 150 స్పెక్స్ విషయానికి వస్తే.. సొగసైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ దీనికి ఉంది. ఇది ప్రసిద్ధ పల్సర్ హెడ్ ల్యాంప్స్ అధునాతన వెర్షన్ ను సూచిస్తుంది. అంతేకాకుండా మస్కులార్ ఇంధన ట్యాంక్ దీనిస్పోర్టీ వెయిస్ట్‌లైన్‌కు భిన్నంగా ఉంటుంది. ఎన్ 160లో ఉన్నట్టుగానే డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్యూయల్ ట్యాంక్ పై యూఎస్‌బీ పోర్ట్, స్పీడోమీటర్ ఉన్నాయి.
పల్సర్ ఎన్ 150 బైకులో 149.68 సీసీ, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది 14.5బిహెచ్ పి పవర్, 13.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో వస్తున్న ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, సస్పెన్షన్ కోసం వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం, స్పోర్ట్ బైక్ ముందు భాగంలో సింగిల్-ఛానల్ ఎబిఎస్ తో కూడిన 240 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ను అమర్చారు.