మహాశివరాత్రి శోభ | - | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి శోభ

Feb 15 2026 6:41 AM | Updated on Feb 15 2026 6:41 AM

మహాశి

మహాశివరాత్రి శోభ

మహా శివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించారు. వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

ఖిలా వరంగల్‌ : చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని మధ్యకోటలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆలయంలో ఉద యం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ ఆధ్వర్యంలో ధర్మకర్తలు, ప్రధాన పూజారి శిలమంతుల శంభులింగం నేతృత్వంలో ఉదయం 11గంటలకు మహాభిల్వార్చన, ధ్వజారోహణం, గణపతి పూజ, అఖండదీపారాధన, మహాభిషేకం, కంకణధారణ, రుద్రహోమాన్ని నిర్వహించారు.

ముస్తాబైన ఆలయం

మహాశివరాత్రి ఉత్సవాలకు చారిత్రకమైన స్వయంభు శంభులింగ్వేరస్వామి దేవస్థానం విద్యుత్‌ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబైంది. ఆల య ప్రాంగణంలో చలువ పందిళ్లు, విద్యుత్‌ లైటింగ్‌, తాగునీటి సౌకర్యాల ఏర్పాట్లతో పాటు క్యూలైన్లకు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు గణపతి పూజ, మహాన్యాసపూర్వక మహాభిషేకాలు నిర్వీరామంగా జరుగనున్నాయి. సాయంత్ర 7.09 నిమిషాలకు పార్వతీ ప రమేశ్వర కల్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు పూజారి శంభులింగం తెలిపారు.

విద్యుత్‌ అలంకరణలో శివాలయం

వరంగల్‌ : కాశిబుగ్గలోని చారిత్రాత్మక కాశీవిశ్వేశ్వర రంగనాథ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవతా రూపాల మాస్కులు ధరించి ఆలయం ముందు నృత్యాలు, ప్రదర్శనలు ఇచ్చారు. శివరాత్రి సందర్భంగా ఆలయ ఆవరణతో పాటు దేవాలయ గర్భగుడి, గోపురం మొత్తం విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. శివరాత్రి జాగరణ చేసే వారి కో సం ఆలయ పక్కనే గల స్థలంలో భక్తిపరమైన కార్యక్రమాలను సోమవారం తెల్లవారుజాము వరకు ఏర్పాటు చేసినట్లు పూర్వ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

మహాశివరాత్రి శోభ1
1/2

మహాశివరాత్రి శోభ

మహాశివరాత్రి శోభ2
2/2

మహాశివరాత్రి శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement