తీరని నష్టం..!
కొద్దితేడా..
‘బల్దియా’ఎన్నికల్లో పోరాడి ఓడిన బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్
కాంగ్రెస్
39.21
శాతం
41.82
శాతం
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఓరుగల్లులో రసవత్తరంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోరులో బీఆర్‌ఎస్‌కు కొద్ది తేడాతో తీరనినష్టం జరిగింది. అధికార పార్టీకి ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు అడ్వాంటేజ్‌గా ఉంటాయన్న చర్చ ఉన్నప్పటికీ.. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఓట్లను విశ్లేషిస్తే బీఆర్‌ఎస్ గట్టిపోటీనే ఇచ్చింది. ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీల్లో ఓటింగ్ సరళిని ఈ విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం ఓట్ల వ్యత్యాసమే ఉంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన కొన్నిచోట్ల ఓటుశాతం ఎక్కువగా ఉన్నా వార్డులను గెలిచేలా పనిచేయలేదు. అయితే తొర్రూరు మున్సిపాలిటీలో ఓటుశాతం తగ్గినా, వార్డులు పెరిగాయి.
స్వల్ప వ్యత్యాసమే...
ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ మొత్తానికి మొత్తం గెలుచుకున్న బీఆర్‌ఎస్ ఈసారి ఒక్క స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ సారి జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,278 ఓట్లకు 2,62,283 ఓట్లే పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు పోలైన ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం తేడా ఉండగా, ఈ తేడాలో 140 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంటే, బీఆర్‌ఎస్ 88లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా మెజార్టీ మున్సిపాలిటీలు చేజారిపోయాయి.
చెదిరిన బీఆర్‌ఎస్ కంచుకోటలు...
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కంచుకోటలు చెదిరిపోయాయి. స్టేషన్‌న్‌ఘన్‌పూర్, నర్సంపేట, డోర్నకల్, భూపాలపల్లి తదితర మున్సిపాలిటీలలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఆయాచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఈ మున్సిపాలిటీల్లో 10 నుంచి 14 శాతం వరకు బీఆర్‌ఎస్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఆ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరిపెడ, ములుగులలో కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థులు దరిదాపుల్లో లేకుండా పోయారు. నర్సంపేటలో 40,968 ఓట్లకు 34,908 కోట్లు పోల్ కాగా అందులో బీఆర్‌ఎస్‌కు 13,756 (39.39 శాతం) ఓట్లు వస్తే కాంగ్రెస్‌కు 17,358 (49.72 శాతం) ఓట్లు వచ్చాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌కు 48.57 శాతం ఓట్లు వస్తే, బీఆర్‌ఎస్‌కు 31.39 శాతం, డోర్నకల్‌లో కాంగ్రెస్‌కు 49.19 శాతం, బీఆర్‌ఎస్‌కు 37,79 శాతమే వచ్చాయి. భూపాలపల్లిలో పోలైన 34,367 ఓట్లలో కాంగ్రెస్‌కు 14,638 (42.59 శాతం) ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 13,949 (40.59 శాతం), ములుగులో కాంగ్రెస్‌కు 44.53 శాతం వస్తే బీఆర్‌ఎస్‌కు 30.44 శాతమే ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మధ్య
2.61 శాతమే ఓట్లతేడా
చాలాచోట్ల అధికంగా వచ్చినా ఆ మేరకు దక్కని సీట్లు
పరకాల, నర్సంపేట, ములుగులలో దరిచేరనీయని హస్తం
తీరని నష్టం..!


