క్యాంపునకు కాంగ్రెస్ కౌన్సిలర్లు
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా ఎంపికై న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు క్యాంపులో భాగంగా శనివారం ఆంధ్రకు తరలివెళ్లారు. 30వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు 21మంది మెజార్టీ ఉన్నప్పటికీ ముందుజాగ్రత్తగా గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. ఆదివారం వారిని తిరిగి తీసుకురానున్నట్లు తెలిసింది.
సందడిగా ఊరి పండుగ
గీసుకొండ: మండలంలోని మరియపురంలో ఊరి పండుగను గ్రామస్తులు శనివారం సందడిగా జరుపుకున్నారు. వర్షాకాలం పంటకాలం ముగిసిన తర్వాత ఊరి పండుగ చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు పండుగ సందర్భంగా గ్రామానికి తరలివచ్చి తమ బంధువులతో ఆత్మీయతను పంచుకున్నారు. క్రైస్తవ మత స్థాపకుడు ఏసుక్రీస్తు తల్లి మేరీమాతను ప్రత్యేక పల్లకి వాహనంపై గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతీ కుటుంబంలో బంధువులు, పిల్లాపాపలు సందడి చేశారు. వేడుకల్లో సర్పంచ్ తిరుమలరెడ్డి అర్పిత, ఆమె భర్త దిలీప్‌రెడ్డి, మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, చర్చి ఫాదర్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక అతిథులుగా మనుగొండకు చెందిన సామాజిక సేవకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి సతీమణి స్వప్న, ఆయన సోదరుడు మర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సరిత హాజరయ్యారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా (బీఓఎస్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రమేశ్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓ ఎస్‌గా పనిచేసిన డాక్టర్ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు.
హన్మకొండ కల్చరల్: వరంగల్‌కు చెందిన కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళి రాసిన కథాసంపుటి ‘నిర్వాణ’ ప్రథమ బహుమతికి ఎంపికై ంది. విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నిర్వాణ కథాసంపుటికి ప్రథమ బహుమతి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన సాహితీవేత్తలు రామా చంద్రమౌళిని శనివారం అభినందించారు.
సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి
ఎంజీఎం: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆర్‌బీఎస్‌కే బృందాల వైద్యాధికారులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పీహెచ్‌సీ, డైక్ సెంటర్‌కు రెఫర్ చేసే విద్యార్థుల వివరాలను వేర్వేరుగా రిజిస్టర్లలో నమోదు చేయాలని, అలాగే పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లకు పరీక్షల నిమిత్తం వెళ్లేప్పుడు ఒకరోజు ముందుగానే వారికి సమాచారం ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గుర్తించిన తీవ్ర పోషణ లోపం, మధ్యమస్థాయి పోషణ లోపం ఉన్న పిల్లలకు అసెస్‌మెంట్ నిర్వహించి ఫాలో చేయాలన్నారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు వినికిడి యంత్రాలను అందించేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కౌమారదశ బాలబాలికలకు వివిధ అంశాలపై అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 2,163 మంది పిల్లలను డైక్ సెంటర్‌కు రెఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆర్‌బీఎస్‌కే వైద్యులు దుర్గాప్రసాద్, కుమారస్వామి, రవీందర్, కవిత, ప్రతాప్‌రెడ్డి, ప్రణతి, మధు, క్రాంతికుమారి పాల్గొన్నారు.
క్యాంపునకు కాంగ్రెస్ కౌన్సిలర్లు
క్యాంపునకు కాంగ్రెస్ కౌన్సిలర్లు


