స్థానికేతరులు వెళ్లిపోవాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్‌క్రైం: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుండడంతో స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి స్టేషన్ ఘన్పూర్, జనగామ, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం ముగియనున్న నేపఽథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయా పార్టీలకు చెందినవారు గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలని సూచించారు.
హన్మకొండ: హనుమకొండ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 9న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి తెలిపారు. వెస్ట్ సిటీ ఫీడర్‌లోని నెహ్రూనగర్, రాక్ గార్డెన్, మెట్టు గుట్ట, బృందావన్ వెంచర్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. కాశిబుగ్గ, శ్రీనివాస వీధి, మదీనా వీధి, గుడి వెనుక ప్రాంతంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, కాశిబుగ్గ, ఏనుమాముల మార్కెట్ రోడ్, మధురానగర్, సాయి గణేశ్ కాలనీ ప్రాంతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, బీఆర్ నగర్, వినాయకనగర్, అమ్మవారిపేట రోడ్డు, మెడికేర్ ఆస్పత్రి, రాజీవ్‌నగర్, భట్టుపల్లి రోడ్డు, నాని గార్డెన్స్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
స్థానికేతరులు వెళ్లిపోవాలి


