కొడవటంచ ఆలయంలో పూజలు..
జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్‌రెడ్డి తొలుత రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారిని మంత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో రావిమొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్‌ప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ పాల్గొన్నారు.


