ఎన్నికల వరకే కాంగ్రెస్ పరుగు
పరకాల: ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌కు ప్రజలు గుర్తుకు వస్తారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తొండ పరుగు ఏనుగు దాకా అన్నట్లుగా ఎన్నికల వరకు కాంగ్రెస్ పరుగెడుతోందని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పరకాల పట్టణంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ర్యాలీ నిర్వహించారు. ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి మీదుగా పరకాల బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ .. బీజేపీతో పరకాల స్మార్ట్‌సిటీగా మారుతోందని స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో నాడు కేటీఆర్, నేడు రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. కరోనా కష్టకాలం నుంచి దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఐదు కిలోల చొప్పున కేంద్రం ఉచితంగా బియ్యం అందిస్తోందని తెలిపారు. మోదీకి పిల్ల లు లేరని దేశప్రజలే ఆయనకు ఓ కుటుంబమని పేర్కొన్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని, బీజేపీతోనే మార్పు సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్ బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, పరకాల నియోజవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు, పరకాల ఎన్నికల ఇన్‌చార్జ్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సిరంగి సంతోశ్‌కుమార్, పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ భృతి పేరుతో కేసీఆర్, రేవంత్‌రెడ్డి మోసం
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
పరకాలలో బీజేపీ ఎన్నికల ప్రచార భారీ ర్యాలీ
ఎన్నికల వరకే కాంగ్రెస్ పరుగు


