విలువలు పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు విలువలను కూడా పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి సూచించారు. యూత్ ఫర్ సేవాసంస్థ ఆధ్వర్యంలో చిగురు కార్యక్రమం పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక, ప్రతిభాపాటవ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా కేయూ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని లక్ష్యాలను సాధించాలని కోరారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ ఆసక్తి, అభిరుచి అనేవి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే శక్తులని పేర్కొన్నారు. తొలుత అతిథులు భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. కేయూ పాలకమండలి సభ్యురాలు బి.రమ, వైస్ ప్రిన్సిపాల్ మమత, ఎంఈఓ శ్రీనివాస్, యూత్‌ఫర్ సేవా సంస్థ బాధ్యులు ఎ.రవీందర్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి


