కాంగ్రెస్‌లో కట్టప్పలు ఉన్నారు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హసన్‌పర్తి: కాంగ్రెస్‌లో ఉన్న కట్టప్పల వల్లే పార్టీ వర్ధన్నపేట మున్సిపాలిటీలో రెండు వార్డులు కోల్పోయిందని స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం 1,.2, 56 డివిజన్‌లకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీకీ మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలకతీతంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలో విలీనమైన తండాలను తిరిగి పంచాయతీలుగా ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. తనకు కూడా తిట్లు వచ్చన్నారు. కార్యక్రమంలో హసన్‌పర్తి, హనుమకొండ తహసీల్దార్లు కిరణ్, రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, డివిజన్ల అధ్యక్షులు కొంక హరిబాబు, కనపర్తి కిరణ్, ఎరుకొండ శ్రీనివాస్, నాయకులు సురేందర్‌రెడ్డి, వెంకటస్వామి, సింగులాల్, వెంకటేశ్వర్లు, రవి, రవీందర్, రాజేష్, పెద్దమ్మ నర్సింహరాములు, సురేష్ పాల్గొన్నారు.


