కొత్త పాలకవర్గానికి సమస్యల స్వాగతం | - | Sakshi
Sakshi News home page

కొత్త పాలకవర్గానికి సమస్యల స్వాగతం

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

కొత్త

కొత్త పాలకవర్గానికి సమస్యల స్వాగతం

నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పరకాల మున్సిపాలిటీ

రూ.15 కోట్ల ఆదాయం.. అంతకు మించి వ్యయం

వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణకే సగానికి పైగా ఖర్చు

నిధులతో పనుల ఆరంభం.. నిధుల కొరతతో అర్ధంతరం

అసంపూర్తిగా

ట్యాంక్‌ బండ్‌

నిర్మాణం

సగరవీధిలో రోడ్డుపై

పేరుకుపోయిన చెత్త

పరకాల: పరకాల మున్సిపాలిటీ కొత్త పాలకవర్గానికి పట్టణాభివృద్ధి ఓ సవాలుగా మారబోతోంది. ఏటా మున్సిపల్‌ ఆదాయం రూ.15 కోట్లు వస్తున్నప్పటికీ.. అంతకు మించి మున్సిపల్‌ ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య పనులకు సగానికిపైగా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు టఫిడ్కో ద్వారా మంజూరైన రూ.10 కోట్ల నిధులతో చేపట్టాల్సిన సీసీ రోడ్ల పనులు జరుగకపోవడంతో పరకాల పట్టణాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. మూడేళ్ల కాలంలో పరకాలలో టఫిడ్కో ద్వారా చేపడుతున్న డ్రెయినేజీ పనులు తప్ప ఒక్క చోట కూడా సీసీ రోడ్డు పోయలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం.. రెండేళ్ల కాలంలోనే నలుగురు కమిషనర్లు మారడం.. ము న్సిపాలిటీ పాలకవర్గం ముగియడంతో పరకాల పట్టణాభివృద్ధిపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు పట్టుపోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నా యి. దీంతో పరకాల పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా పట్టణాభివృద్ధి రెండు అడుగులు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నట్లుగా మా రింది. కొత్త పాలకవర్గం పెండింగ్‌ సమస్యల పరి ష్కారంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారి స్తుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

షెడ్డు వేయాలి..

పరకాలలో కూరగాయలు, మాంసం దుకాణాలకు మార్కెట్‌లో షెడ్లు వేసినట్లే చేపలు అమ్ముకోవడానికి షెడ్డు నిర్మించాలి. గతంలో ఎమ్మెల్యే చెప్పినప్పటికీ కూరగాయల మార్కెట్‌లో చేపల విక్రయాలను అక్కడి దుకాణాల నిర్వాహకులు అడ్డుకోవడంతో రోడ్లపై అమ్ముకోవాల్సి వస్తోంది. కొత్త కౌన్సిలర్లు జోక్యం చేసుకుని చేపల మార్కెట్‌ నిర్మించాలి. –సాంబలక్ష్మి, చేపల వ్యాపారి

నిధులు

మంజూరై నాలుగేళ్లు..

పరకాలలో మా వాడ అభివృద్ధికి దూరంగా ఉంది. కనీసం వాడకు సీసీ రోడ్డు కాదు కదా.. డ్రెయినేజీ కూడా గతి లేదు. సీసీ రోడ్డుకు రూ.8 లక్షల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు చెప్పడం.. అప్పటి చైర్‌పర్సన్‌ సోదా అనిత శంకుస్థాపన చేయడంతో ఎంతో సంబురపడ్డాం. కానీ, నిధులు మంజూరై నాలుగేళ్లయినా ఎలాంటి పని జరగలేదు.

– కేశెట్టి వెంకటేశ్వర్లు, లక్కంవాడ

డ్రెయినేజీ కడతామంటే గోడలు

కూలగొట్టుకున్నాం..

మా వాడకు రోడ్డు పోస్తాం. డ్రెయినేజీ కట్టిస్తామంటే ఎంతో ఆశగా ఇళ్ల గోడలు, గదులు కూలగొట్టుకున్నాం. కానీ, ఏమైందో తెలియదు. సీసీ రోడ్ల పనులు చేయకపోవడంతో వర్షకాలంలో ఇంటి ఎదుట బురద, డ్రెయినేజీ నీరు నిలిచి చాలా ఇబ్బందులు పడుతున్నాం.

– మొలుగూరి వెంకటలక్ష్మి, లక్కంవాడ

కొత్త పాలకవర్గానికి  సమస్యల స్వాగతం1
1/3

కొత్త పాలకవర్గానికి సమస్యల స్వాగతం

కొత్త పాలకవర్గానికి  సమస్యల స్వాగతం2
2/3

కొత్త పాలకవర్గానికి సమస్యల స్వాగతం

కొత్త పాలకవర్గానికి  సమస్యల స్వాగతం3
3/3

కొత్త పాలకవర్గానికి సమస్యల స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement