రేపు సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 20వ తేదీన సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే అథ్లెట్లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
వేయిస్తంభాల ఆలయంలో
ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఐదో రోజు బుధవారం ముగిశాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన యాగాన్ని పూర్తిచేసి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈసందర్భంగా గంగు ఉపేంద్రశర్మ, ఆలయ ఈఓ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ఐదురోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో సహకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, నగర సీపీ సన్‌ప్రీత్‌సింగ్, పరోక్షంగా సహకరించిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దాతలు వద్దిరాజు వెంకటేశ్వర్లు, సీతారాంరెడ్డి, కృష్ణవేణి, వేముల సత్యమూర్తి, అయినవోలు వెంకట సత్యమోహన్, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, సేవా సమితి మహిళా సభ్యులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు పక్కన చేపల విక్రయాలు


