అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి మొండి బకాయిల వసూళ్లపై దృష్టిసారించాలి

మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే నాయిని వినతి

హన్మకొండ చౌరస్తా: జిల్లాలో రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డిని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో పెండింగ్‌లో ఉన్న రహదారి పనులు, నూతన రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రికి అందించారు. నియోజకవర్గంలో దెబ్బతిన్నాయని, ప్రజల రాకపోకలకు కష్టతరంగా మారుతోందని ఎమ్మెల్యే నాయిని, మంత్రికి వివరించారు. ప్రతిపాదనలను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి, సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మేయర్‌ గుండు సుధారాణి, ఆర్‌ఆండ్‌బీ శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉన్నారు.

హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

విద్యారణ్యపురి: జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు సంబంధించిన మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ సంబంధిత బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వరంగల్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెట్టుబడులు, రుణాల వసూళ్లపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement