‘పుర’పోరుకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్లు | - | Sakshi
Sakshi News home page

‘పుర’పోరుకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్లు

Feb 6 2026 8:39 AM | Updated on Feb 6 2026 8:39 AM

‘పుర’పోరుకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్లు

‘పుర’పోరుకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్లు

‘పుర’పోరుకు కాంగ్రెస్‌ కోఆర్డినేటర్లు

12 మున్సిపాలిటీలకు సీనియర్ల నియామకం

సాక్షిప్రతినిధి, వరంగల్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జ్‌ లుగా నియమించిన టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌.. వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపైనే పెట్టారు. నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ వరంగల్‌, మహబూబాబాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. వీరికి తోడు మున్సిపాలిటీల వారీగా కోఆర్డినేటర్లను గురువారం నియమించారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని జనగామ మున్సిపాలిటీకి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లుకు మున్సిపల్‌ ఎన్నికల కోఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చారు. వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, కొలను హనుమంతరెడ్డిని నియమించారు. పరకాలకు టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్‌కు భీమగాని సౌజన్య, భూపాలపల్లికి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, వర్ధన్నపేటకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని డోర్నకల్‌ మున్సిపాలిటీకి గాజర్ల అశోక్‌, మరిపెడకు ఎంపీ పోరిక బలరాంనాయక్‌, కేసముద్రంకు దూడ వెంకటరమణ, మహబూబాబాద్‌కు సీహెచ్‌ వెంకటేశ్‌, ములుగుకు ఈవీ శ్రీనివాస్‌రావు, నర్సంపేటకు డాక్టర్‌ పులి అనిల్‌కుమార్‌ను సమన్వయకర్తలుగా టీపీసీసీ నియమించింది. కోఆర్డినేటర్లుగా నియమితులైన వారికి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. కోఆర్డినేటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా ఇతర సీనియర్లకు భవిష్యత్‌లో నామినేటెడ్‌ పోస్టులకు మున్సిపల్‌ ఎన్నికల విజయాలకు కూడా పార్టీ అధిష్టానం లింకు పెట్టినట్లు సమాచారం. కాగా, టీపీసీసీ నియమించిన సమన్వయకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం వెంటనే రంగలోకి దిగారు.

జనగామ, తొర్రూరు, మరిపెడకు

ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్‌

ఉత్తర్వులు జారీచేసిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌

అభ్యర్థుల గెలుపునకు..

నామినేట్‌ పదవులకు లింకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement