ఉద్యాన పంటలతో సుస్థిర ఆదాయం
● జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు
ఖానాపురం: తక్కువ నీటితో ఆయిల్‌పామ్ ఎక్కువ దిగుబడి సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. బుధరావుపేటలో ఉద్యాన పంటల సాగు–అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం వస్తుందన్నారు. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యానపంటల వైపు మళ్లాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగులో శాసీ్త్రయ పద్ధతులే కీలకమని పేర్కొన్నారు. నీటి లభ్యతను బట్టి మొక్కలకు తగినంత నీటిని అందిస్తే గెలల బరువు పెరుగుతుందన్నారు. ఎరువుల వినియోగంలో రైతులు నిర్లక్ష్యం వహించకూడదని, ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఖానాపురం అధికారి తరుణ్, సర్పంచ్ పెసరు రాణిగోవర్ధన్‌రెడ్డి, ఆయిల్‌పామ్ రైతులు పాల్గొన్నారు.


