సేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

Feb 6 2026 8:39 AM | Updated on Feb 6 2026 8:39 AM

సేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

సేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

సేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

గీసుకొండ: ప్రజలకు అందించే వైద్య సేవలను ఆన్‌లైన్‌లో తప్పకుండా నమోదుచేయాలని వరంగల్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు వైద్యాధికారులకు సూచించారు. నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పీహెచ్‌సీలు, పల్లె దవాఖాన వైద్యాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఆశ కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు సమన్వయంతో పనిచేసి ఫలితాలు రాబట్టాలని, ఎవరైనా సమయపాలనను పాటించకుంటే అధికారులకు నివేదికలు పంపించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్‌ మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు. క్యాన్సర్‌ రాకుండా 15 సంవత్సరాల్లోపు పిల్లలకు ఇవ్యాల్సిన వ్యాక్సినేషన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఇవ్వడానికి హెపటైటిస్‌–బీ వ్యాక్సినేషన్‌ వెంటనే ప్రారంభించాలని సూచించారు. సమావేశంలో డాక్టర్‌ సయ్యద్‌ ఇఫ్తార్‌, మాతాశిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ప్రసన్నలక్ష్మి, క్షయ వ్యాధి నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సరిత, వైద్యాధికారులు, పల్లె దవాఖాన వైద్యాధికారులు, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ సాంబశివరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement