21.44 కిలోల గంజాయి స్వాధీనం
ఖానాపురం: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. ఖానాపురంల పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని కోయకొండ గ్రామానికి చెందిన మడకం శ్రీను, కలుగూడ గ్రామానికి చెందిన సలబం రాహుల్ ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. వారు ఒడిశా నుంచి రూ.10,70,700 విలువ చేసే 21.44 కిలోల ఎండు గంజాయిని బ్యాగుల్లో నింపుకొని మహబూబాబాద్ మీదుగా వరంగల్ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై రఘుపతి ఖానాపురం శివారులో వాహనాల తనిఖీ చేపట్టగా పోలీసులను చూసి నిందితులు పరార్ అవుతుండగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామన్నారు. భీమరాజు అనే వ్యక్తి రూ.40 వేల కమీషన్ ఇస్తామని చెప్పి 11 గంజాయి ప్యాకెట్లను రైల్వేస్టేషన్‌కు తరలించాలని చెప్పారని ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో నిందితుల నుంచి గంజాయి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ సాయిరమణ, ఎస్సై రఘుపతి, సిబ్బంది సీతారామరాజు, అక్షిత్, రమేశ్, ప్రదీప్, సంతోష్, చందర్, విజయ్, వీరస్వామి, సుమన్, హోంగార్డులు రాజు, ఎర్రయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన
నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి


