నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్‌లోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి ఖమ్మం బైపాస్ రోడ్డు నుంచి అమ్మవారిపేట రోడ్డు వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.1.09 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణ పనులను మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవితో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సంక్షేమం, నగరాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సమస్యలు లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, కేడల పద్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ
సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు శంకుస్థాపన


