వెబ్‌కాస్టింగ్‌తో పోలింగ్ ప్రక్రియ పరిశీలన
న్యూశాయంపేట: కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ కంట్రోల్ రూం నుంచి నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో మున్సిపల్ పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 80 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కార్యాలయం, రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం కూడా నేరుగా పర్యవేక్షించినట్లు తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆమె వెల్లడించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


