ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌

Feb 12 2026 7:01 AM | Updated on Feb 12 2026 7:01 AM

ఉమ్మడ

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌

గతంతో పోలిస్తే పెరిగిన 13.38 శాతం

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, డోర్నకల్‌, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్‌ల నుంచి 1,073 మంది కౌన్సిలర్‌ల కోసం పోటీ పడ్డారు. బుధవారం రాత్రి వరకు అధికారుల ప్రకటించిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో 80.09 శాతంగా పోలింగ్‌ నమోదైంది. ఉమ్మడి జిల్లా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,244 మంది ఓటర్లకు 2,58,930 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2020లో జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 9 మున్సిపాలిటీలలో 200 వార్డులుండగా ఏకగ్రీవమైన 18 వార్డులు మినహాయించి 182 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 2,32,763 మంది ఓటర్లకు ఆ ఎన్నికల్లో 1,77,508 (76.26 శాతం) మంది ఓట్లేశారు. 2020 ఎన్నికలకు ఈసారి ఎన్నికలు పోలిస్తే కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపాలిటీలు పెరిగాయి. పెరిగిన మున్సిపాలిటీలు, ఓటర్లు, పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే గతంతో పోలిస్తే 13.38 శాతం పెరిగింది.

80.66 %

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌1
1/4

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌2
2/4

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌3
3/4

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌4
4/4

ఉమ్మడి జిల్లాలో 80.09 శాతం పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement