యువ ప్రపంచ క్రికెట్‌ కప్‌ మనదే | - | Sakshi
Sakshi News home page

యువ ప్రపంచ క్రికెట్‌ కప్‌ మనదే

Feb 7 2026 3:13 PM | Updated on Feb 7 2026 3:13 PM

యువ ప్రపంచ క్రికెట్‌ కప్‌ మనదే

యువ ప్రపంచ క్రికెట్‌ కప్‌ మనదే

యువ ప్రపంచ క్రికెట్‌ కప్‌ మనదే

ఐసీసీ అండర్‌–19 గెలుపుపై సంబురాలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: జింబాబ్వే దేశంలోని హరారే పట్టణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన అండర్‌–19 ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఇండియా విజేతగా నిలిచి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. భారత కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే నేతృత్వంలో వైభవ్‌ సూర్యవంశీ 175 పరుగులు చేసి విజయఢంకా మోగించడంలో కీలకపాత్ర పోషించారు. యువ ప్రపంచకప్‌ను సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు స్వీట్లు పంచుకుని, బాణసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. సంబురాల్లో మార్నేని ఉదయభానురావు, బండారి ప్రభాకర్‌, మట్టెడ కుమార్‌, అనిల్‌, నాగేశ్‌, నరేశ్‌, అవినాశ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement