నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

Feb 7 2026 3:13 PM | Updated on Feb 7 2026 3:13 PM

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

మంత్రి కొండా సురేఖ

ఖిలా వరంగల్‌: ప్రజాపాలన దిశగా పేదల సక్షేమం, తూర్పు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు శుక్రవారం వరంగల్‌ 35వ డివిజన్‌ శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌లో జనరల్‌ ఫండ్‌ నిధులు రూ.కోటి వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు, మున్నూరుకాపు కమ్యూనిటీహాల్‌ అభివృద్ధి పనులను మేయర్‌ గుండు సుధారాణి, కార్పొరేటర్‌ సోమిశెట్టి ప్రవీణ్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్‌, కొత్తపెల్లి శ్రీనివాస్‌, శ్రీరాం రాజేశ్‌, పగడాల సతీశ్‌, శ్రీధర్‌, కేడల పద్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement