సంఘమేశ్వరుడి కల్యాణం
సంగెం: మండల కేంద్రంలోని సంఘమేశ్వరాలయంలో ఆదివారం రాత్రి సంఘమేశ్వరస్వామి, గంగాభవానీ పార్వతిదేవి వివాహం వైభవంగా జరిగింది. అర్చకులు అప్పె నాగార్జున శర్మ వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ తంతు నిర్వహించారు. సంఘమేశ్వరుడి తరఫున ఆలయ కమిటీ చైర్మన్ మునుకుంట్ల సరిత, కోటేశ్వర్, పార్వతీదేవి తరఫున సర్పంచ్ పేర్ల లలిత, రమేశ్ దంపతులు కల్యాణం చేపట్టారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చిన కల్యాణాన్ని తిలకించారు. ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే కుంటపల్లిలోని రామలింగేశ్వరాలయంలో పురోహితుడు అప్పె గోపీకృష్ణ శర్మ శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇందూరి శివారెడ్డి, రాణి, సర్పంచ్ పెంతల సువర్ణ, సురేందర్, తదితరులు హాజరై పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, మేకపోతుల బండ్లతో ప్రదక్షిణ చేశారు.
సంఘమేశ్వరుడి కల్యాణం


