వర్ధన్నపేటలో.. | - | Sakshi
Sakshi News home page

వర్ధన్నపేటలో..

Feb 17 2026 9:03 AM | Updated on Feb 17 2026 9:03 AM

  వర్ధన్నపేటలో..

వర్ధన్నపేటలో..

వర్ధన్నపేట మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారి టి.సుమ ఆధ్వర్యంలో సోమవారం చైర్మన్‌ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌ పా ర్టీ తరఫున చైర్మన్‌ అభ్యర్థిగా పాలకుర్తి సారంగపాణి పేరును మాలోతు దేవేందర్‌ ప్రతి పాదించగా, బెజ్జం పాపారావు బలపరిచారు. వైస్‌చైర్‌పర్స న్‌గా షీభారాణిని నూనావత్‌ కమిలి ప్రతిపాదించగా తిరుపెల్లి వాణి బలపరిచారు. బీఆర్‌ఎస్‌ తరపున గుజ్జ వీరన్న పేరును తీసుకు రాగా ఎన్నికల అధికారి అభ్యంతరం తెలుపుతూ తమకు బీఫామ్‌ అందజేయలేదని, పార్టీ తరఫున పోటీ చేయడానికి కుదరదని తెలపడంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎన్నికల అధికారితో వాగ్వాదానికి దిగారు. అయినా నిబంధనలకు లోబడి నిర్వహిస్తామని తెలపడంతో చివరకు ఇండిపెండెంట్‌ చైర్మన్‌ అభ్యర్థిగా గుజ్జ వీరన్నను బానోతు జ్యోతి ప్రతిపాదించగా, సిలువేరు రమ బలపరిచారు. అనంతరం చేతులెత్తే పద్ధతిన చైర్మన్‌ ఎన్నికను నిర్వహించారు. సారంగపాణికి ఇండిపెండెంట్‌ సభ్యురాలు షీభారాణి, ఎక్స్‌అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే నాగరాజుతో కలిపి ఏడుగురు కావడంతో చైర్మన్‌గా సారంగపాణిని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement