ఎన్నిక ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నిక ఇలా..

Feb 17 2026 9:03 AM | Updated on Feb 17 2026 9:03 AM

ఎన్నిక ఇలా..

ఎన్నిక ఇలా..

నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా గంధం నరేందర్‌ను కాంగ్రెస్‌ సభ్యులతో పాటు సీపీఎం, బీజేపీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండవ సాధారణ మున్సిపల్‌ ఎన్నికల అధికారి, ఆర్డీఓ పోలం ఉమారాణి ఎంపికై న చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లను ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో 30వార్డులు ఉండగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి 21, బీఆర్‌ఎస్‌ 6, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్‌ 1 అభ్యర్థులు గెలుపొందారు. శుక్రవారం ఎంపిక ప్రక్రియను ఆర్డీఓ ఉమారాణి ప్రారంభించగా ఎక్స్‌ అఫిషియో అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన ఓటును వినియోగించుకోవడంతో 25 ఓట్లు లక్ష్మికి రావడంతో చైర్మన్‌గా ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కాటం భాస్కర్‌, సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు అన్ని పార్టీల నుండి ఎంపిక అయిన కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement