రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల్లో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల్లో సత్తా చాటాలి

Feb 17 2026 9:03 AM | Updated on Feb 17 2026 9:03 AM

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల్లో సత్తా చాటాలి

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల్లో సత్తా చాటాలి

సీపీ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: సైబరాబాద్‌ కమిషనరేట్‌లో నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న నాలుగో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ డ్యూటీ మీట్‌ క్రీడల్లో వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు సత్తా చాటాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ సూచించారు. తెలంగాణ పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ పోటీల్లో, క్రీడా గ్రామంలో ఎగురవేసే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ క్రీడా పతకాన్ని సోమవారం సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులు, క్రీడాకారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఈ పోటీల్లో పాల్గొనే పోలీస్‌ క్రీడాకారులకు సీపీ చేతుల మీదుగా ట్రాక్‌ సూట్‌తో పాటు స్పోర్ట్స్‌ షూ, టీ షర్ట్‌ అందజేశారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్‌ క్రీడల్లో వరంగల్‌ పోలీస్‌ క్రీడాకారులు తమ సత్తా చూపాలని, పోలీసులు శాంతి భద్రతల్లోనే కాదు క్రీడల్లో కూడా రాణించగలరని చూపాలన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి శాఖాపరమైన గుర్తింపు ఉంటుందని సీపీ తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ నాగయ్య, ఆర్‌ఐ సతీశ్‌, ఆర్‌ ఎస్సై శ్రవణ్‌కుమార్‌, క్యాంపు క్లర్క్‌ వేణుగోపాల్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement