దూకుడు | - | Sakshi
Sakshi News home page

దూకుడు

Feb 7 2026 3:13 PM | Updated on Feb 7 2026 3:13 PM

దూకుడ

దూకుడు

న్యూస్‌రీల్‌

వరంగల్‌
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
గెలుపే లక్ష ్యంగా

ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు

స్వతంత్రులు కూడా వెరవని వైనం

ఎన్నికల ప్రచార ఆర్భాటాలకు రూ.లక్షల్లో ఖర్చు

విజయమే ధ్యేయంగా ప్రధాన పార్టీల ప్రణాళికలు

ప్రచార మోజులోపడి ఈసీ నిబంధనలకు తూట్లు

సాక్షి, వరంగల్‌: ఎంతైనా సరే అంతిమంగా గెలుపే లక్ష్యమనే ధోరణిలో మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. నామినేషన్‌ నుంచి ప్రచారం ముగిసే వరకు రూ.లక్షల్లో ఖర్చవుతున్నా ఎక్కడా ఏమాత్రం ఎవరూ తగ్గడం లేదు. ఎంత ఖర్చైనా సరే.. ఏమాత్రం తగ్గేదేలే అన్న ధోరణిలో విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి ఆయా పార్టీల టికెట్ల కోసం ముఖ్యనేతల వద్ద రూ.లక్షల్లో డిపాజిట్లు పెట్టి కొంతమంది బీఫారాలు పొందారు. ప్రచారం ఇప్పుడు తారాస్థాయికి చేరుతుండడంతో పైసలు వెదజల్లేందుకు వెనుకాడడం లేదు.

భారీగా పెరుగుతున్న ప్రచార ఖర్చు

ఉదయం, సాయంత్రం వార్డుల్లో ప్రచారం, ప్రముఖులు వచ్చినప్పుడు రోడ్‌ షోలు, జన సమీకరణకు పంపకాలు, భోజనాలు, ఇతరత్రా ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ప్రచార ఖర్చు భారీగా పెరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారానికి అభ్యర్థులు మూడింతలు ఖర్చుచేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మున్సిపాలిటీల్లో పోటీ చేసే కౌన్సిలర్‌ అభ్యర్థి వ్యయపరిమితి లక్ష రూపాయలు కాగా, అంతకు ముప్పయింతలు ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతోంది. ఎన్నికల నిఘా వ్యవస్థకు చిక్కకుండా అభ్యర్థులు పైసల మంత్రంతో విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఈ ఎన్నికల ఖర్చు కోసం కొంతమంది అభ్యర్థులు తమ భూములు, ప్లాట్లు అమ్ముకొని జనవరిలోనే డబ్బులు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఖర్చు చేస్తున్నారు.

దూకుడు1
1/1

దూకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement