వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో నాటకీయం | - | Sakshi
Sakshi News home page

వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో నాటకీయం

Feb 17 2026 7:14 AM | Updated on Feb 17 2026 7:14 AM

వైస్‌

వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో నాటకీయం

వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో నాటకీయం

పరకాల: మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య వైస్‌ చైర్మన్‌గా ఏకు దివ్యను ఎన్నుకున్నారు. ఆమె ఎన్నికతో ఒక్కసారిగా బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీల నాయకులతో మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా అని చెప్పడంతోనే తాము బయటకు వెళ్లిపోయాయమని కానీ, మధ్యాహ్నం 1.52 గంటలకు ఫోన్‌ ద్వారా మెసేజ్‌ చేసి కోరం లేకుండానే వైస్‌ చైర్మన్‌ ఎన్నిక చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో పరకాల మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. మున్సిపల్‌ కార్యాలయ గేట్లు నెడుతూ లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏసీపీ సతీశ్‌బాబు, సీఐ క్రాంతికుమార్‌ జోక్యం చేసుకొని ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లను ఆర్డీఓతో మాట్లాడుకోవాలని నచ్చజెప్పారు. దీంతో కార్యాలయం లోపలికి వచ్చిన బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు తాము లేకుండా వైస్‌ చైర్మన్‌ నియామకం ఎలా చేస్తారని, ఈ అక్రమ ఎన్నికపై ఎన్నికల కమిషన్‌, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

మొదటి సమావేశంలోనే మోసం: బీజేపీ

పరకాల మున్సిపల్‌ ఏర్పడ్డ చరిత్రలో మొదటిసారి అక్రమ పద్ధతిలో వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఉన్న తర్వాత వాయిదా వేస్తున్నట్లు అధికారులు మొదట ఎందుకు ప్రకటించి బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లను తప్పుదోవ పట్టించి బయటకు వెళ్లేలా చేశారు. బయటకు వెళ్లిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వైస్‌ చైర్మన్‌గా ఏకు ది వ్యను ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌ మోసాలకు నిదర్శనంగా వైస్‌ చైర్మన్‌ ఎన్నికను భావిస్తున్నాం. అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలికారు.

వాయిదా వేసినట్లే వేసి.. వైస్‌ చైర్మన్‌ ఎన్నికతో వివాదం

ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు

పరకాల మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో నాటకీయం1
1/1

వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో నాటకీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement