పరకాల.. ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

పరకాల.. ప్రశాంతం

Feb 17 2026 7:14 AM | Updated on Feb 17 2026 7:14 AM

పరకాల.. ప్రశాంతం

పరకాల.. ప్రశాంతం

పరకాల.. ప్రశాంతం

పరకాల: చైర్మన్‌..వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు కావాల్సిన మెజార్టీ కంటే అదనంగా మరో సీటును 13 వార్డులను కాంగ్రెస్‌ గెలుచుకోవడంతో పరకాల మున్సిపల్‌ కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారంతో పాటు చైర్మన్‌ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల సమయం నుంచి పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా.. చైర్మన్‌ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న 7వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి పావుశెట్టి సునీల్‌ పరకాల మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అదే విధంగా ఎవరూ ఊహించని విధంగా మొదటిసారిగా కౌన్సిలర్‌గా గెలిచిన 4వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి ఏకు దివ్య పేరు తెరమీదికి రావడమే ఆలస్యం ఆమె వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌ కోసం పార్టీలో ఆరుగురు అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడటంతో చివరకు దివ్యను వైస్‌ చైర్మన్‌గా పార్టీ పెద్దలు నిర్ణయించడంతో పరకాల ఆర్డీఓ డాక్టర్‌ కె.నారాయణ ప్రకటించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.అంజయ్య ధ్రువీకరణ పత్రం అందజేశారు.

నేరుగా కార్యాలయానికి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు

రాష్ఠ్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం పరకాల మున్సిపల్‌ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారత్సోవానికి మున్సిపల్‌ సమావేశ మందిరంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్డీఓ కె.నారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య పర్యవేక్షణలో కొత్త కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నిక చేపట్టారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి క్యాంపులో ఉన్న 13 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో నేరుగా కార్యాలయానికి 10:50 గంటలకు చేరుకున్నారు. కొంత ఆలస్యంగా 11:05 గంటలకు బీఆర్‌ఎస్‌ ఐదుగురు కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్లు ముగ్గురు చేరుకున్నారు. ఒక్క 5వ వార్డు కౌన్సిలర్లు (బీఆర్‌ఎస్‌) హాజరుకాలేదు. ప్రమాణ స్వీకరాత్సోవాన్ని 12 గంటలకు పూర్తి చేశారు. అరగంట తర్వాత 12.30 గంటలకు మున్సిపల్‌ చైర్మన్‌గా పావుశెట్టి సునీల్‌ను చైర్మన్‌ అభ్యర్థిగా 19వ వార్డు కొయ్యడ శ్రీనివాస్‌ ప్రతిపాదించగా 16వ వార్డు అభ్యర్థి బండి శ్రీధర్‌ బలపర్చడంతో మిగతా 10 మంది ఆయనకు ఓటు వేశారు. దీంతో చైర్మన్‌గా పావుశెట్టి సునీల్‌ ఎన్నికై న ట్లు ఆర్డీఓ నారాయణ ప్రకటించారు. చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన సునీల్‌కు మున్సిపల్‌ కమి షనర్‌ అంజయ్య ధ్రువీకరణ పత్రం అందజేశారు. చైర్మన్‌ ఎన్నిక తర్వాత 1 గంటకు వైస్‌ చైర్మన్‌ను ఎన్నికోవాల్సిన అధికారులు.. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వా యిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు 1.15 నిమిషాలకు బయటకు వె ళ్లిపోగా 2.18 గంటలకు నాటకీయ పరిణామాల మ ధ్య వైస్‌ చైర్మన్‌గా దివ్య ఎంపికైనట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement