చైర్మన్ పదవి కోసం బీఆర్‌ఎస్ కుట్ర
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పరకాల: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కుట్రపూరిత ఆలోచనలు చేసినా.. వారి ఆటలు సాగడం లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. చైర్మన్ పదవిని దక్కించుకోవద్దనే ఆలోచనతో బీఆర్‌ఎస్ బ్రోకర్లతో బేరసారాలు చేసిందని ఆరోపించారు. పరకాల నియోజకవర్గంలో రౌడీయిజాన్ని ఉక్కుపాదంలా అణచివేస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో 13 మందిని గెలిపించిన పరకాల పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పరకాల మున్సిపాలిటీని నూతన పాలకవర్గం మెచ్చేలా పాలన కొనసాగేందుకు కృషిచేస్తానని స్పష్టం చేశారు. మున్సిపల్ గెలుపుతో పరకాల ఎమ్మెల్యేగా తనపై మరింత బాధ్యత పెరిగిందని, పరకాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. గత రెండేళ్లలో పట్టణాభివృద్ధికి తాను చేస్తున్న తీరుకు తీర్పుగా పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారన్నారు. కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, మాజీ ఎంపీపీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను ఆయా శాఖల అధికారులు, తహసీల్దార్లు వేగంగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. వినతుల పరిష్కారంలో ఆలస్యం చేయవద్దని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 89 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్‌ఓ వై.వి గణేశ్, హనుమకొండ ఆర్‌డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
● మారని ఎంజీఎం ఏఎంసీ తీరు
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర విభాగాల పని తీరు పూర్తిగా అధ్వానంగా మారుతోంది. రెండు నెలల క్రితం డీఎంఈ ఆస్పత్రిని పరిశీలించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. దానికి తోడు రోజురోజుకూ సేవలు మరింత అధ్వానంగా మారుతున్నాయి. ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఏఎంఎసీ, ఐఎంసీ విభాగాల్లో నిత్యం పడకల్లో ఒక్కరు లేదా ఇద్దరు పేషెంట్లను ఉంచుతున్నారు. కొన్ని సందర్భాల్లో స్ట్రెచర్లపై, వీల్ చైర్లపైనే వైద్యం అందిస్తున్నారు. ఇలా వైద్యం పొందే వారు జ్వరం, స్వల్ప అస్వస్థతలో వచ్చే వారు కాదు. ప్రాణపాయస్థితిలో ఉన్న వారే ఎక్కువ మంది. పరిస్థితిని బట్టి చూస్తే ఎంజీఎం ఆస్పత్రిలో ఏ మేర వైద్యసేవలు అందుతున్నాయో అర్థమవుతోంది. ఈ విషయాన్ని రోగుల సహాయకులు పరిపాలనాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆ సమయాల్లో విధులు నిర్వర్తించాల్సిన డీఎంఓ, డీఎస్‌ఓఓలు కానరావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలు పర్యవేక్షించాల్సిన ఆర్‌ఎంఓలు చాంబర్లు దాటి వార్డులకు రావట్లేదని వారంతా వాపోతున్నారు.
చైర్మన్ పదవి కోసం బీఆర్‌ఎస్ కుట్ర
చైర్మన్ పదవి కోసం బీఆర్‌ఎస్ కుట్ర


