సమస్యలతో సావాసం
అభివృద్ధికి దూరంగా మున్సిపాలిటీలు
డీసీతండాలోనిర్మాణంలో ఉన్న వాటర్‌ట్యాంకు
● నర్సంపేట, వర్ధన్నపేటలో వసతులు కరువు
● అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు, తాగునీటి సరఫరా
● విలీనగ్రామాల్లో పరిస్థితి మరీ అధ్వానం
● నూతన పాలకవర్గాలపైనే ప్రజల ఆశలు
నిర్మాణ దశలోనే ఇంటిగ్రేటెడ్
మార్కెట్
నిరుపయోగంగా దోభీఘాట్
భవనం
పైపులైన్ నిర్మాణంతో దెబ్బతిన్న సీసీ రోడ్డు
నర్సంపేట/వర్ధన్నపేట: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. నర్సంపేట, వర్ధన్నపేటలో పాలకవర్గాలు కొలువుదీరాయి. కాలనీల్లోని ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గుంతలమయమైన రహదారులు, అస్తవ్యస్తమైన డ్రెయినేజీలు, వీధిదీపాలు, తాగునీటి సరఫరాతోపాటు పైపులైన్ల లీకేజీలను పట్టించుకునే వారు కరువయ్యారు. ముఖ్యంగా విలీన గ్రామాల్లోని పరిస్థితి అధ్వానంగా తయారైంది. కనీస వసతులకు నోచుకోలేదు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడే అభివృద్ధి పనులు చేపట్టారని ప్రజలు పేర్కొంటున్నారు. నూతనంగా కొలువుదీరిన పాలకవర్గాలు సమస్యలు పరిష్కరించాలని నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల ప్రజలు కోరుతున్నారు.
వర్ధన్నపేటలో సమస్యలు..
పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో 2023లో రూ.2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయ నిర్మాణ పనులు ప్రారంభించారు. మూడు సంవత్సరాలు దాటినా పనులు పూర్తి కాలేదు.
మూడు సంవత్సరాల క్రితం రాయపర్తి మండలం సరిహద్దులో తెట్టెకుంటా తండా సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మానవ వ్యర్థాలతో ఎరువు తయారు చేసే రీసైక్లింగ్ యూనిట్‌ను ప్రారంభించలేదు.
సంగెపు వాగు పక్కన దోభిఘాట్ భవనాన్ని ఏర్పాటు చేసి యంత్రసామగ్రిని సైతం బిగించి వదిలేశారు. విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయలేదు. రజకులకు సౌకర్యాలు కల్పించలేదు.
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో డీసీతండాలో సెంట్రల్ లైటింగ్ నిరుపయోగంగా మారింది.
తాగునీటి సమస్య తీర్చడానికి అమృత్ పథకం కింద రూ.34.08 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన నడుస్తున్నాయి. 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంగెపు వాగు ఒడ్డున గ్రౌండ్ లెవల్ దశలో వాటర్ ట్యాంకు, డీసీతండా వద్ద 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నీటి సరఫరాకు 50 కిలోమీటర్లకు పైపులైన్ల పనులు చేపట్టారు. ఇప్పటివరకు 40 శాతం మేర మాత్రమే పనులు అయ్యాయి.
మున్సిపాలిటీలో 10 మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఉన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో 10 మంది కార్మికులు, వాహనాలను నడిపేందుకు డ్రైవర్లు, ఒక ఎలక్ట్రీషియ న్, స్వీపర్లు, కామాటి సిబ్బంది అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
వర్ధన్నపేటలో ఇళ్లు, ఇతర పన్నుల ఆదాయం రూ.1.20 కోట్లు ఉంది. ఇందులో కేవలం పన్నుల వసూళ్లు 70 శాతం దాటడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పట్టణ ప్రగతి కుంటుపడే ప్రమాదముంది.
సమస్యలతో సావాసం
సమస్యలతో సావాసం
సమస్యలతో సావాసం
సమస్యలతో సావాసం
సమస్యలతో సావాసం


