టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు
ఉప్పుల సతీశ్
విద్యారణ్యపురి: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పుల సతీశ్ డిమాండ్ చేశారు. టీపీయూస్ రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్‌ను వరంగల్ జిల్లా డీఈఓ రంగయ్యనాయుడుతో ఆవిష్కరించారు. ఈసందర్భంగా సతీశ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలను విడుదల చేయాలన్నారు. అర్హులైన టీచర్లకు పదోన్నతులివ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్‌తేజ, సైన్స్ ఆఫీసర్ శ్రీనివాస్, ఉల్లాస్ కో–ఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు, టీపీయూఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బత్తిని వెంకటరమణ, జిల్లా జనరల్ సెక్రటరీ ఎ.శేఖర్, బాధ్యులు రవికుమార్, సదానందం, రాములు, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, తిరుపతిరావు, రాజు పాల్గొన్నారు.


