ఇదేం తీరు? | - | Sakshi
Sakshi News home page

ఇదేం తీరు?

Feb 18 2026 6:47 AM | Updated on Feb 18 2026 6:47 AM

ఇదేం తీరు?

ఇదేం తీరు?

గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తి హవేలి ప్రభుత్వ ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాలల నిర్వహణ తీరుపై కలెక్టర్‌ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాల (పీఎస్‌)ను మంగళవారం సందర్శించి విద్యార్థులకు మధ్యాహ్నం వండిపెట్టే బియ్యంలో పురుగులు ఉండడమే కాకుండా కూర సరిపోకపోవడం, అందరికీ సరిపోయేలా వంటకాలు లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం అరుణకు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని, వంటలు వండే వారిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండు పాఠశాలల ఆవరణ పరిశుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ముగ్గురు ఉపాధ్యాయులు ఉదయం, మధ్నాహ్నం హాజరు సంతకాలను ఒకేసారి పెట్టడంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎంఈఎ రవీందర్‌ను ఆదేశించగా ఆయన కలెక్టర్‌కు సమర్పించారు. టెన్త్‌ క్లాస్‌ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్‌తేజ, ఎంపీఓ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు తుమ్మనపెల్లి స్వప్న, జన్ను దివ్యభారతి, హెచ్‌ఎం రంగనాథ్‌, పంచాయతీ కార్యదర్శులు నల్లెల్ల స్వప్న, నరేష్‌, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య తదితరులు ఉన్నారు.

రెండో విడత సర్పంచ్‌ల

శిక్షణ కార్యక్రమం పరిశీలన

జిల్లాలోని నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం, రాయపర్తి మండలాలకు చెందిన సర్పంచ్‌లకు గ్రామపంచాయతీ పాలనపై రెండో విడతలో భాగంగా గంగదేవిపల్లిలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ మేరకు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ సత్యశారదతో పాటు పంచాయతీ రాజ్‌ శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌ వెస్లీ వేర్వేరుగా పరిశీలించారు.

పాఠశాలల నిర్వహణపై కలెక్టర్‌ సత్యశారద ఆగ్రహం

హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

టెన్త్‌ విద్యార్థుల అభ్యసన

సామర్థ్యాలపైనా అసంతృప్తి

ఉపాధ్యాయుల హాజరు తీరుపై

అసహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement