బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
పురపాలన అంతా మహిళల చేతుల్లోకి వెళ్లిపోయింది. సోమవారం, మంగళవారం.. జరిగిన ఎన్నికల్లో వారికే పెద్దపీట దక్కింది. వాస్తవానికి అన్నిచోట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు సోమవారం జరగాల్సి ఉంది. కోరం లేని కారణంగా డోర్నకల్.. సరిసమానమైన మెజారిటీ, గొడవలు, ఉద్రిక్తతతో జనగామ, తొర్రూరు ఎన్నికలను మంగళవారానికి వాయిదా వేశారు. ఈ రెండు రోజుల్లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో సగానికి పైగా పదవులను మహిళలు సాధించారు. 12 చైర్‌పర్సన్ స్థానాల్లో 7 స్థానాలను మహిళలు గెలుచుకున్నారు. వైస్ చైర్మన్ స్థానాల్లో 8 మంది మహిళలే దక్కించుకున్నారు. వారంతా కూడా సోమ, మంగళవారాల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఉమ్మడి వరంగల్‌లో 12 మున్సిపాలిటీలకు 12 కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకోగా.. ఇందులో అత్యధికంగా మహిళలే కావడంపై చర్చ జరుగుతోంది. జనరల్ స్థానాల్లోనూ సమీకరణల్లో భాగంగా అనూహ్యంగా చైర్‌పర్సన్ పదవులు ‘ఆమె’ను వరించాయి. ములుగు మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వు కాగా అక్కడ చింతనిప్పుల చంద్రకళ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు. మహబూబాబాద్ ఎస్టీ జనరల్ అయినప్పటికీ ఇక్కడ ఎస్టీ మహిళ గుగులోత్ జ్యోతికి పురపీఠం వరించింది. మరిపెడలో వీసారపు ప్రగతి, కేసముద్రంలో బానోత్ సునీత, నర్సంపేటలో పెండెం శ్రీలక్ష్మి మున్సిపల్ చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎన్నికలు జరిగిన జనగామ బీసీ జనరల్‌కు రిజర్వు కాగా, ఇక్కడ లాటరీ ద్వారా 22వ వార్డు కౌన్సిలర్ కడకంచి బాలమణిని చైర్‌పర్సన్‌గా అదృష్టం వరించింది. డోర్నకల్ ఎస్సీ జనరల్ కాగా ఇక్కడా మహిళకు అవకాశం ఇవ్వడంతో కుండేటి రాజకుమారి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా వైస్ చైర్‌పర్సన్లుగా లావణ్య (డోర్నకల్), నీల రాజమ్మ (స్టేషన్‌ఘన్‌పూర్), నేనావత్ షీభారాణి (వర్ధన్నపేట), హతియా షాహీన్ (ములుగు), దివ్య (పరకాల), సునీత (మరిపెడ), అల్లం రమ (కేసముద్రం)కు చాన్స్ దక్కింది. బీఆర్‌ఎస్ గెలుస్తుందనుకున్న తొర్రూరు మున్సిపాలిటీ కూడా లాటరీలో కాంగ్రెస్‌కే దక్కగా, అక్కడ 14వ వార్డు కౌన్సిలర్ సోమ రజిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
జ్యోతి
మహబూబాబాద్
బాలమణి
జనగామ
బానోత్ సునీత
కేసముద్రం
రాజకుమారి
డోర్నకల్
వీసారపు ప్రగతి
మరిపెడ
పెండెం శ్రీలక్ష్మి
నర్సంపేట
– సాక్షిప్రతినిధి, వరంగల్
చంద్రకళ
ములుగు
గెలిపించింది, గెలిచింది ‘ఆమె’నే
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన నారీమణులు.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎన్నికల నిర్ణేతలుగా నిలిచారు. ఇదే సమయంలో అత్యధిక మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ పీఠాలను అధిష్టించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17.. మూడు తేదీల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పురుషులకంటే 1.09 లక్షల మంది మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగాప్రచురించిన ఓటర్ల జాబితాలో నూ భూపాలపల్లి మినహా అంతటా వారిదే ఆధిక్యం ఉంది. మొత్తం 12 బల్దియాలలో 3,35,244 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 1,72,087 కాగా, పురుషులు 1,63,088. ఇందులో 1,27,004 మంది పురుషులు ఓట్లేయగా, మహిళలు 1,35,238 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.
నీల రాజమ్మ
స్టేషన్‌ఘన్‌పూర్
సునీతారెడ్డి
మరిపెడ
జనగామ ఎమ్మెల్యే పల్లా
ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
అల్లం రమ
కేసముద్రం
షీభారాణి
వర్ధన్నపేట
ఏకు దివ్య
పరకాల
లావణ్య
డోర్నకల్
రజిని
తొర్రూరు
ఆసియాషాహీన్
ములుగు
చైర్ పర్సన్లు
ఓరుగల్లు మున్సిపల్ పీఠాలపై మహిళలదే పై‘చేయి’..
మున్సిపల్ ఎన్నికల్లో
అందివచ్చిన అవకాశం
12 మున్సిపాలిటీలకు
ఏడు చోట్ల మహిళలే చైర్‌పర్సన్లు
8 మున్సిపాలిటీల్లో వారే
వైస్ చైర్‌పర్సన్లు..
‘ఆమె’కు కలిసొచ్చిన ‘లక్కీ’
వైస్ చైర్ పర్సన్లు
ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్..
మహిళలకు దక్కిందెక్కడ..
బుధవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


