సర్ మ్యాపింగ్ 47శాతం పూర్తి
న్యూశాయంపేట: జిల్లాలోని వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మ్యాపింగ్ 47.79శాతం పూర్తి అయిందని, మిగిలిన ప్రక్రియ నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులు పాల్గొన్నారు.
నక్షా లేని గ్రామాల్లో రీసర్వే
జిల్లాలోని నక్షా లేని గ్రామాల్లో రీసర్వే నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు, అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.


