వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Feb 15 2026 6:41 AM | Updated on Feb 15 2026 6:41 AM

వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

నర్సంపేట: సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో వివిధ ఖాతాదారుల సేవలతో పాటు రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ముంబై సెంట్రల్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎంవీ.మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నర్సంపేట బ్రాంచ్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దగా, బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీధర్‌ అధ్యక్షతన మురళీకృష్ణతో పాటు హైదరాబాద్‌ జోనల్‌ ముఖ్య అధికారి ధరమ్‌సింగ్‌ నాయక్‌, వరంగల్‌ రీజినల్‌ ముఖ్య అధికారి కృష్ణమోహన్‌, వరంగల్‌ జిల్లా నాబార్డు డీడీఎం టి.రవి, ఎంఎస్‌ఎంఈ క్లస్టర్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ కె.శర్మ ముఖ్యఅతిథులుగా హాజరై శనివారం ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో వ్యవసాయ రుణ వితరణ కార్యక్రమం చేపట్టారు. సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నిర్వహిస్తున్న సెంట్‌ అగ్రిగోల్డ్‌ లోన్‌, సెంట్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌ ప్లస్‌ రైస్‌ మిల్లు, సెంట్‌ జీఎస్టీ, సెంట్‌ తనాఖా వ్యాపార రుణంతో పాటు వివిధ పథకాలపై రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ రకాల వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన బ్యాంక్‌ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ రీజినల్‌ కార్యాలయం అధికారులు సాంబయ్య, రాజారాం, శ్రీకాంత్‌, నర్సంపేట బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ తనుశ్రీ, సిబ్బంది ఉజ్మ, మౌనిక, సాదిక్‌, గోల్డ్‌ అప్రైజర్‌ వీరభద్రయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సెంట్రల్‌ బ్యాంకు ముంబై సెంట్రల్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement