నెక్కొండలో నగదు, నగలు చోరీ | - | Sakshi
Sakshi News home page

నెక్కొండలో నగదు, నగలు చోరీ

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

నెక్కొండలో నగదు, నగలు చోరీ

నెక్కొండలో నగదు, నగలు చోరీ

నెక్కొండ: మండల కేంద్రంలోని మహ్మద్‌రహీం ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. మహ్మద్‌రహీం ఈనెల 11న బంధువుల ఇంటికి భార్యతో కలిసి వెళ్లాడు. ఈనెల 12 రాత్రి ఇంటి తాళంర పగులగొట్టి దొంగలు బీరువాలోని 5 తులాల బంగారం, 18 తులాల వెండి ఆభరణాలు, రూ. 3 లక్షల నగదు దొంగలు అపహరించుకెళ్లారని బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.

గవిచర్లలో..

సంగెం: మండలంలోని గవిచర్లలో దొంగలు చోరీకి పాల్పడారు. గ్రామానికి చెందిన గాలి కొమురమ్మ, సారంగం దంపతులు, కుటుంబ సభ్యులు గురువారం దుగ్గొండి మండలం దేశాయిపల్లిలో కొమురమ్మ తల్లి సంవత్సరీకం కోసం వెళ్లారు. శుక్ర వారం ఇంటికి వచ్చే సరికి తాళం పగులగొట్టి కనిపించింది. రెండు తులాల బంగారు నెక్లెస్‌, అర్ధతులం కమ్మలు, గున్నాలు, 22 తులా ల వెండి పట్టీలు, రూ.లక్ష నగదును అపహరించుకుని పోయారని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement