కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
నర్సంపేట: నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఎన్నికల అబ్జర్వర్ కె.శివకుమార్ సందర్శించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు వ్యవస్థ, స్ట్రాంగ్ రూమ్ భద్రత, తదితర అంశాలను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సంబంధిత ఎన్నికల అధికారులు అబ్జర్వర్‌కు కౌంటింగ్ ఏర్పాట్లపై వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇండస్ట్రీయల్ నర్సింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.


