ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ వారీగా వివిధ పార్టీలకు వ
న్యూస్‌రీల్
స్వతంత్రులు
ఇతరులు
బీజేపీ
బీఆర్‌ఎస్
కాంగ్రెస్
13,341 38.31% 12,057 34.63% 2416 6.94% 7007 20.12%
13,949 40.59% 14,638 42.59% 2789 8.11% 2,991 8.70%
18,483 37.20% 17070 34.36% 1,270 2.56% 12,858 25.88%
4,919 31.39% 7612 48.57% 728 4.64% 2411 15.38%
6,743 48.97% 6,149 44.65% 436 3.16% 422 2.92%
3,363 37.79% 4,378 49.19% 251 2.82% 908 8.18%
4,723 40.24% 5,449 46.42% 198 1.69% 1,368 11.65%
8,267 38.39%
8,267 38.39%
3735 17.35%
1,064 4.71%
3,418 30.44% 4999 44.53% 1669 14.86% 1,141 8.99%
3,978 43.82% 3,709 40.86% 740 8.15% 650 7.16%
7,718 46.46% 7,992 48.11% 713 4.29% 188 1.31%
13,753 39.39% 17,358 49.72% 1,645 4.71% 2,152 6.16%
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఓరుగల్లులో రసవత్తరంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోరులో బీఆర్‌ఎస్‌కు కొద్ది తేడాతో తీరనినష్టం జరిగింది. అధికార పార్టీకి ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు అడ్వాంటేజ్‌గా ఉంటాయన్న చర్చ ఉన్నప్పటికీ.. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఓట్లను విశ్లేషిస్తే బీఆర్‌ఎస్ గట్టిపోటీనే ఇచ్చింది. ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీల్లో ఓటింగ్ సరళిని ఈ విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం ఓట్ల వ్యత్యాసమే ఉంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన కొన్నిచోట్ల ఓటుశాతం ఎక్కువగా ఉన్నా వార్డులను గెలిచేలా పనిచేయలేదు. అయితే తొర్రూరు మున్సిపాలిటీలో ఓటుశాతం తగ్గినా, వార్డులు పెరిగాయి.
స్వల్ప వ్యత్యాసమే...
ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ మొత్తానికి మొత్తం గెలుచుకున్న బీఆర్‌ఎస్ ఈసారి ఒక్క స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ సారి జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 12 మున్సిపాలిటీల్లో మొత్తం 3,35,278 ఓట్లకు 2,62,283 ఓట్లే పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు పోలైన ఓట్లను గమనిస్తే కేవలం 2.61 శాతం తేడా ఉండగా, ఈ తేడాలో 140 వార్డులను కాంగ్రెస్ కై వసం చేసుకుంటే, బీఆర్‌ఎస్ 88లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా మెజార్టీ మున్సిపాలిటీలు చేజారిపోయాయి.
చెదిరిన బీఆర్‌ఎస్ కంచుకోటలు..
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కంచుకోటలు చెదిరిపోయాయి. స్టేషన్‌న్‌ఘన్‌పూర్, నర్సంపేట, డోర్నకల్, భూపాలపల్లి తదితర మున్సిపాలిటీలలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఆయాచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు పోలైన ఓట్లను పరిశీలిస్తే ఈ మున్సిపాలిటీల్లో 10 నుంచి 14 శాతం వరకు బీఆర్‌ఎస్‌కు తక్కువ ఓట్లు పడ్డాయి. ఫలితంగా ఆ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మరిపెడ, ములుగులలో కూడా బీఆర్‌ఎస్ అభ్యర్థులు దరిదాపుల్లో లేకుండా పోయారు. నర్సంపేటలో 40,968 ఓట్లకు 34,908 కోట్లు పోల్ కాగా అందులో బీఆర్‌ఎస్‌కు 13,756 (39.39 శాతం) ఓట్లు వస్తే కాంగ్రెస్‌కు 17,358 (49.72 శాతం) ఓట్లు వచ్చాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌కు 48.57 శాతం ఓట్లు వస్తే, బీఆర్‌ఎస్‌కు 31.39 శాతం, డోర్నకల్‌లో కాంగ్రెస్‌కు 49.19 శాతం, బీఆర్‌ఎస్‌కు 37,79 శాతమే వచ్చాయి. భూపాలపల్లిలో పోలైన 34,367 ఓట్లలో కాంగ్రెస్‌కు 14,638 (42.59 శాతం) ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 13,949 (40.59 శాతం), ములుగులో కాంగ్రెస్‌కు 44.53 శాతం వస్తే బీఆర్‌ఎస్‌కు 30.44 శాతమే ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఓటు శాతం పెరిగినా సీట్లు పెరగలే..
మహబూబాబాద్ మున్సిపాలిటీలో 65,712 ఓట్లకు 49,681 పోల్‌కాగా.. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు 18,483 (37.20 శాతం), కాంగ్రెస్‌కు 17,070 (34.36 శాతం) ఓట్లు వచ్చాయి. ఆ మేరకు వార్డులను బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవకపోవడం వల్ల హంగ్ ఏర్పడింది. పరకాలలో 38.39 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు, 39.32 శాతం బీఆర్‌ఎస్‌కు వచ్చినా ఆ బల్దియా హస్తగతం అయ్యింది. వర్దన్నపేటలో బీఆర్‌ఎస్ 43.82 శాతం ఓట్లను సాధించగా, కాంగ్రెస్‌కు 40.86 శాతమే వచ్చాయి. కానీ ఆ మేరకు బీఆర్‌ఎస్‌కు వార్డులు దక్కకపోగా ఫలితాలు హంగ్ దిశగా వచ్చాయి. అలాగే జనగామలో సుమారు 4 శాతం ఓట్లు అధికంగా సాధించినా హంగ్‌ను ఎదర్కునే పరిస్థితి ఏర్పడింది. పోలైన ఓట్ల ప్రకారం 1.65 శాతం బీఆర్‌ఎస్ అభ్యర్థులకు తక్కువ వచ్చినా.. అక్కడ 16 వార్డుల్లో 9 గెలుచుకున్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా నియామకం లేకపోవడంతో వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. యూనివర్సిటీలో అన్నివిభాగాలు, వర్సిటీ కాలేజీలు కలిపి 409 పోస్టులు మంజూరు ఉంది. 77 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 187 మంది పార్ట్‌టైం అధ్యాపకులు, 176 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా వివిధ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో పేపర్‌వైజ్‌గా కూడా కొందరిని నియమించారు. అయినా ఇంకా అధ్యాపకుల కొరత ఉంది. దీంతో పార్ట్‌టైం లెక్చరర్ల నియమాకానికి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
100 మంది నియామకం..
కేయూపరిధిలో 130 మంది పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి అనుమతి లభించింది. ఇందుకు కేయూ పాలకమండలి కూడా ఆమోదించింది. పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి ఏర్పాటు చేసిన కమిటీ కూడా అధికారులకు నివేదిక సమర్పించింది. స్టాండింగ్ కమిటీలో కూడా చర్చించారు. 130 మంది పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాల్సిండగా.. అందులో 100 మంది నియామకానికి ఈనెల 16న వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
ఇంజనీరింగ్ కళాశాలల్లో నియామకం లేనట్టే..
కేయూలోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో 27 మంది వరకు పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాలని యోచించారు. కానీ, రెండు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటివరకు పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేయలేదు. దీంతో ఆ కళాశాలల్లో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకం ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే, జర్నలిజం విభాగంలో ముగ్గురు పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాలని యోచించినా ఈ నోటిఫికేషన్‌లో ఇస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఈ విషయంపై రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా ఈనెల 16న పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ధ్రువీకరించారు.
● 16న నోటిఫికేషన్
ఇవ్వనున్న అధికారులు
● వివిధ విభాగాల్లో
100 పోస్టుల భర్తీకి నిర్ణయం
‘బల్దియా’ఎన్నికల్లో
పోరాడి ఓడిన బీఆర్‌ఎస్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మధ్య
2.61 శాతమే ఓట్లతేడా
చాలాచోట్ల అధికంగా వచ్చినా
ఆ మేరకు దక్కని సీట్లు
పరకాల, నర్సంపేట, ములుగులో దరిచేరనీయని హస్తం
మున్సిపల్ ఎన్నికలపై నేతల
పోస్టుమార్టం.. పార్టీలో సాగుతున్న
అంతర్మథనం
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ వారీగా వివిధ పార్టీలకు వ
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ వారీగా వివిధ పార్టీలకు వ
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ వారీగా వివిధ పార్టీలకు వ
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ వారీగా వివిధ పార్టీలకు వ
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీ వారీగా వివిధ పార్టీలకు వ


