ఒక టికెట్‌పై రెండు సినిమాలు..
ప్రస్తుతం నాకు 83 సంవత్సరాలు. నా చిన్నతనంలో శివరాత్రి పండుగ రోజున ఇంట్లోనే శివుడి ఫొటోకు పూజలు చేసేవారం. ఇంటి చుట్టు పక్కన స్నేహితులు, కుటుంబ సభ్యులం కబుర్లు చెప్పుకుంటూ జాగరణ ఉండేవారం. 30 ఏళ్ల నుంచి ఆలయాలను సందర్శిస్తున్నాం. నిద్రరాకుండా ఉండాలంటే సినిమా టాకీసుల్లో ఒక టికెట్‌పై రెండు సినిమా ప్రదర్శనలు ఉండేవి. టాకీసు, టీవీల్లో అలనాటి పౌరాణిక సినిమాలు చూసేది. ప్రస్తుతం కాలం మారింది. ఇప్పటితరం వాళ్లు బిజీ అయిపోయారు.
– సిద్ధోజు సుదర్శన్, తిలక్‌రోడ్డు, వరంగల్


