పీఎం శ్రీ స్కూళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని పీఎం శ్రీ స్కూల్స్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి తనిఖీలు చేయపట్టనున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్ కింద ఎంపికై న 16 పాఠశాలల అభివృద్ధిపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ప్రత్యేక తనిఖీ నిర్వహించిన అనంతరం రూపొందించిన నివేదికల ఆధారంగా ఈ సమీక్ష నిర్వహించామన్నారు. ఇకపై ఆయా పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. డీఈఓ రంగయ్యనాయుడు, డీబీసీడీఓ పుష్పలత, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, డీహెచ్‌ఎస్‌ఓ శ్రీని వాస్‌రావు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫైనాన్షియల్ లిటరసీ వీక్–2026 కార్యక్రమాన్ని జిల్లాలో సోమవారం అధికారికంగా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలి రాజు తదితరులు పాల్గొన్నారు.


