అర్జీలు త్వరగా పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు త్వరగా పరిష్కరించండి

Feb 10 2026 7:12 AM | Updated on Feb 10 2026 7:12 AM

అర్జీలు త్వరగా పరిష్కరించండి

అర్జీలు త్వరగా పరిష్కరించండి

అర్జీలు త్వరగా పరిష్కరించండి

హనుమకొండ

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ.. మొత్తం 118 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్‌ఓ వై.వి. గణేశ్‌, ట్రెయినీ ఐపీఎస్‌ మనీషా నెహ్రా, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు పాల్గొన్నారు.

ఎస్సెస్సీ శిక్షణ తరగతులపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా నిర్వహిస్తున్న ప్రత్యేక కోచింగ్‌ తరగతులపై మండలాల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో పదో తరగతి పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలకు వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ పురోగతిపై అధికారులతో చర్చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్‌ఓ వైవీ గణేశ్‌, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, సీపీఓ సత్యనారాయణరెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement